ఉట్నూర్: ఆపదలో ఆపద్బాంధవుడు బొడ్డు కిరణ్

71చూసినవారు
ఉట్నూర్: ఆపదలో ఆపద్బాంధవుడు బొడ్డు కిరణ్
ఉట్నూర్ మండలంలోని పాత ఉట్నూర్ కు చెందిన జాడి మహేశ్వరికి బీజేవైఎం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు కిరణ్ శనివారం రక్తదానం చేసి మంచి మనసును చాటుకున్నారు. మహేశ్వరి గర్భిణీ కావడంతో అత్యవసరంగా రక్తం అవసరం ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె బంధువులు కిరణ్ ను సంప్రదించగా, ఆయన ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లి రక్తదానం చేశారు. కిరణ్ ఇప్పటివరకు పలు సందర్భాల్లో 34 సార్లు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్