ఉట్నూరు ఏటీసీ విజయం ఆదర్శం

2చూసినవారు
ఉట్నూరు ఏటీసీ విజయం ఆదర్శం
ఉట్నూరులోని అడ్వాన్స్డ్ టెక్నాలజీకేంద్రం (ఏటీసీ)లో అత్యుత్తమ శిక్షణతో 100 మందిలో 99 మంది విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం రాష్ట్రానికే ఆదర్శమని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం రాత్రి ఉట్నూరులో ఎమ్మెల్యే వెదుబొజ్జు, ఎంపీ గోడం నగేష్, ఐటీడీఏ పీవో మంద మకరందు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి ఏటీసీ ప్రిన్సిపల్ ఆర్. శ్రీనివాస్ ను మంత్రి సన్మానించి అభినందించారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర ఏటీసీ కేంద్రాలు ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులకు మరింత ఆసక్తిని పెంచి ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.