
మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్‌పై దాడి!
TG: మేడారం మహాజాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క ఆగమనం అనంతరం భక్తులు గద్దెల వద్దకు వస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా కరెంటు పోవడంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గందరగోళ సమయంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్‌పై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




