ఆదిలాబాద్‌లోని చిల్కూరి లక్ష్మీనగర్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రాథోడ్ సాయినాథ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు మంగళవారం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన ఆయన, వాహనదారులు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నంబర్లతోనే వాహనాలు నడపాలని సూచించారు.