ఆదిలాబాద్ కలెక్టరేట్ విసి హాల్ నుండి జిల్లా, మండల స్థాయి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించిన కలెక్టర్ రాజర్షిషా, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే గ్రామ, వార్డుసభలను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామా, వార్డు సభల నిర్వహణ, ఏర్పాట్లు, జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా సమీక్షించారు.