సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను, సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్‌లో బీజేపీ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.