ఉమ్మడి జిల్లాలో గిరిజనుల సమగ్ర సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఐటీడీఏ నూతన పీవో మంద మకరందు తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజనుల జీవనోపాధి మెరుగుదలకు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమ
లు చేస్తామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.