వృద్ధులను గౌరవించడంతో పాటు వారిని ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కోసం ఉన్న చట్టాల గురించి అది సమైక్య అధ్యక్షుడు దేవిదాస్ దేశ్పాండే అవగాహన కల్పించారు.