ఆదిలాబాద్ లో ఆగస్టు 7న యోగాసన పోటీలు

85చూసినవారు
ఆదిలాబాద్ లో ఆగస్టు 7న యోగాసన పోటీలు
జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 7, 8వ తేదీల్లో మావలలోని రత్న గార్డెన్‌లో వివిధ విభాగాల్లో యోగాసన ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుపతి రెడ్డి, బుధవారం తెలిపారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని సెప్టెంబర్ లో ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.