అదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని వడ్డాది గ్రామానికి చెందిన జామిడి అనే యువ రైతు పొలంలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా, పైలట్ రాకేష్ ఆధ్వర్యంలో సిబ్బంది సకాలంలో స్పందించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.