గుడిహత్నూర్ మండలంలోని బెల్లూరి గ్రామానికి చెందిన జ్యోతి క్యాన్సర్ తో బాధపడుతూ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగిన ఆమెను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.