మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 12 బాక్సుల మద్యం వాంకిడిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి పెట్రోలింగ్ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును తనిఖీ చేయగా, రూ. 1. 04 లక్షల విలువైన మద్యం బాక్సులు బయటపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ ఆదివారం పత్రికా ప్రకటనలో తెలిపారు.