తిర్యాణి మండలం కన్నెపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మల్లేష్ అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకున్న మల్లేష్ మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మల్లేష్ గత కొన్ని రోజులుగా మానసికంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.