కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బండల గూడెం గ్రామానికి చెందిన కోడప నరహరి (25) అనే యువకుడు ఇప్పలగూడెం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం బహిర్భూమికని వెళ్లిన నరహరి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యవసాయ బావిలో అతని మృతదేహం లభించడంతో, మద్యం సేవించి బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.