ఆస్తి వివాదంతో నిరాశ్రయులైన కుటుంబం

0చూసినవారు
ఆస్తి వివాదంతో నిరాశ్రయులైన కుటుంబం
కాగజ్‌నగర్‌ మండలంలోని ఇస్గాం గ్రామంలో కుటుంబ ఆస్తి వివాదం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. 18 ఏళ్ల పాటు తల్లిదండ్రులను పోషించిన తనను, భార్యను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేశారని శంభు మండల్‌ ఆరోపించాడు. ప్రస్తుతం నలుగురు కుమార్తెలతో కలిసి వ్యవసాయ భూమిలోని మోటార్‌ గదిలో తలదాచుకుంటున్నాడు. ఇంటి పన్ను రశీదులు, పాత రికార్డులు తన పేరుపైనే ఉన్నాయని చెబుతున్నాడు. అధికారులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, జిల్లా కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాడు.

సంబంధిత పోస్ట్