కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హోళీ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలంలోని నారాయణపూర్–కిష్టాపూర్ గ్రామాల మధ్య రహదారిపై బైక్ మరియు కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోళీ సందర్భంగా వేగంగా వాహనాలు నడపకూడదని పోలీసులు సూచించారు.