తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండోసారి కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తూ వాంకిడి మండలంలోని బంబారా గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు. వీరికి ఆసిఫాబాద్ నియోజకవర్గ
కాంగ్రెస్ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ రెండో రోజు సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో పాల్గొని గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు. ప్రజా పాలన, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, గ్రంథాలయ చైర్మన్ అనిల్, రాజంపేట వార్డు సభ్యుడు జావిద్ భాయ్, సీనియర్ నాయకుడు కాశి అన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.