కాగజ్‌నగర్ సమీపంలోని చింతగూడ రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మంచిర్యాల–బల్లర్షా మార్గంలో జరిగిన ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు సమాచారం. రైల్వే పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 99484 81902, 87126 58605 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.