Jan 21, 2026, 02:01 IST/
బస్సు-స్కూటర్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Jan 21, 2026, 02:01 IST
తమిళనాడులోని కరూర్ జిల్లా లాలపేట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వచ్చిన బస్సు స్కూటర్‌ను బలంగా ఢీకొనడంతో.. ఏడాది వయసున్న చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.