సిద్దిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి పట్టణం 28వ వార్డుకు చెందిన సింగరేణి కార్మికుడు ఎండి రఫీ (48) మృతి చెందారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న కుమారుడి పేరెంట్స్ మీటింగ్ కోసం భార్యతో కలిసి వెళ్లిన రఫీ, తిరిగి వస్తుండగా ట్రాలీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్యకు గాయాలయ్యాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రఫీ ఖైరీగూడ స్టోర్స్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.