మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆకినేపల్లి శివారులో చింతచెట్టుకు 5 రోజుల క్రితం ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డికి చెందిన పొలం వద్ద దుర్వాసన రావడంతో గమనించాడు. చెట్టు కొమ్మల మధ్య ఓ వ్యక్తి ఉరేసుకొని ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.