నెన్నెల: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

61చూసినవారు
నెన్నెల: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థి బేతు వర్షిత్ సాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. మంగళవారం రాత్రి అమ్మమ్మ ఇంట్లో భోజనం చేసిన వర్షిత్ సాయి, తన ఇంట్లో కూడా భోజనం చేశాడు. తెల్లవారుజామున కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.