
బెల్లంపల్లి: ఎమ్మెల్యే వినోద్ స్పందించాలి
బెల్లంపల్లి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా షెడ్లు, ఇతర నిర్మాణాలను కూల్చివేస్తున్న ఘటనపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు వల్ల నిరాశ్రయులైన బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులైన వారికి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.































