
ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కల్పించిన అధికారులు
కాసిపేట మండలంలో ఈనెల 14న జరగనున్న రెండవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, తాసిల్దార్ సునీల్ కుమార్, ఎంపిఓ షేక్ సఫ్దర్ అలీ, ఎన్నికల పర్యవేక్షణ అధికారి పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా కృషి చేయాలని, ప్రవర్తన నియామావళిని పాటించాలని సూచించారు. అభ్యర్థుల బాధ్యతలు, ప్రచార పరిమితులు, వాహనాలు, మైక్ అనుమతులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్, కాసిపేట ఎస్ఐలు, ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.




































