
సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. సబ్ స్టేషన్ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






































