
జేడీ వాన్స్‌కు సలహాదారుగా ఉంటా: ఉషా వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్, తన భర్తకు తాను నమ్మకమైన సలహాదారుగా ఉంటానని తెలిపారు. వ్యక్తిగత విషయాల్లో తన అభిప్రాయాన్ని ఆయన తప్పకుండా తీసుకుంటారని, తనకు నచ్చని విషయంలో భర్తతో ఏకీభవించనని చెప్పారు. ఆయన ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని, వివాహ బంధంలో ప్రతి పనిలోనూ భర్తకు అండగా ఉండాలనుకుంటానని ఉషా వాన్స్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.




