బోథ్ మండల కేంద్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యఅతిథిగా హాజరై, డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, వాహన నిబంధనలు పాటిస్తూ ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు.