మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే

0చూసినవారు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే
సోనాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతును ఎమ్మెల్యే సన్మానించారు. జొన్న కొనుగోలు కేంద్రాల కొరకు ప్రభుత్వాన్ని కోరుతున్నామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులతో రోడ్డెక్కుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :