బోథ్ నియోజకవర్గంలో పలు రూట్లలో బస్సులు నిలిచిపోయాయని, కొత్త రూట్లలో బస్సులు నడపాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇచ్చోడ బస్ స్టేషన్ 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, దానిని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరికొండ, తలైగూడ, కరంజీ, నిగ్నె, వధురు, కుంతల మీదుగా బస్సులు నడపాలని సూచించారు.