పోలీసులపై తిరగబడిన ఇద్దరిపై కేసు.. అరెస్ట్ జైలుకు తరలింపు

469చూసినవారు
పోలీసులపై తిరగబడిన ఇద్దరిపై కేసు.. అరెస్ట్ జైలుకు తరలింపు
బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపేట కాలనీలో వడ్డెర కమ్యూనిటీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన పోలీసులపై ఇత్తారి రాజేష్, ధారంగుల దుర్గేష్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటన ఈనెల 24న చోటుచేసుకుంది. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఎస్సై రమేష్ ఈ వివరాలను తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్