ఇంస్టాగ్రామ్ లో రెచ్చగొట్టేలా పోస్టు చేసిన యువకుడిపై కేసు

0చూసినవారు
ఇంస్టాగ్రామ్ లో రెచ్చగొట్టేలా పోస్టు చేసిన యువకుడిపై కేసు
భీంపూర్ మండలంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ధ్వంసం ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోథ్‌కు చెందిన జాదవ్ వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ గురుస్వామి తెలిపారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించినందుకు బోథ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్