ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల డబ్బులు మింగిన గుత్తేదారుపై కలెక్టర్ ఆదేశాలు

1126చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల డబ్బులు మింగిన గుత్తేదారుపై కలెక్టర్ ఆదేశాలు
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం కోఠ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల డబ్బులను గుత్తేదారు దాపరికం చేసిన వ్యవహారంపై కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. సంబంధిత అధికారులను సంప్రదించి, గుత్తేదారుపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, హౌసింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం తమ ప్రాధాన్యమని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్