మంగళవారం సోనాల మండలం గుట్టపక్క తండాలో ఏఆర్ డిఎస్పి కమతం ఇంద్ర వర్ధన్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. 2 ఆటోలు, 28 ద్విచక్ర వాహనాలను పరిశీలించగా, నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 4 బైకులను గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పెండింగ్ లో ఉన్న 15 వాహనాల చలానాల ద్వారా రూ. 16,750 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.