ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నారాయణపూర్ కు చెందిన సుజాతకు పురిటి నొప్పులు రావడంతో, భర్త లక్ష్మణ్ 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవ నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ సమయంలో 108 సిబ్బంది గోపి చాకచక్యంగా వ్యవహరించి, అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. పండంటి ఆడ శిశువు జన్మించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని పైలెట్ పవర్ బాబు తెలిపారు.