ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. సిఆర్పి సేవల నిలిపివేత

6చూసినవారు
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. సిఆర్పి సేవల నిలిపివేత
భీంపూర్ మండలం పిప్పల్‌కోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్న పి. రవీందర్‌ను ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు డీఈవో రాజేశ్వర్ విధుల నుండి తొలగించారు. ఎంఈఓ నివేదిక ప్రకారం, రవీందర్ ఒక రాజకీయ పార్టీలో చేరి, ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నట్లు దినపత్రికల వార్తలు, విచారణ ఆధారాలు వెల్లడించాయి. సమగ్ర శిక్షా తెలంగాణ ఉపాధి ఒప్పంద నిబంధనల ప్రకారం సిబ్బంది రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు. క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్