టెక్నాలజీతో పంటల సాగుకు రైతులు ముందుకు రావాలి
తాంసి మండలం పొన్నారి గ్రామ శివారులో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డ్రోన్ టెక్నాలజీతో సాగు చేసిన నువ్వుల పంటను బుధవారం కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఆధునిక టెక్నాలజీతో పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని, యాంత్రికరణ ద్వారా విత్తనాలు వేయడం, పంటలకు పిచికారి చేయడం, ఎరువులు చల్లడం వంటివి చేపట్టాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరిన్ని పంటలకు ఈ సాంకేతికతను ఉపయోగించుకోవాలని తెలిపారు.
