భీంపూర్: మహారాష్ట్ర దేశిదారు అమ్ముతున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్

65చూసినవారు
భీంపూర్: మహారాష్ట్ర దేశిదారు అమ్ముతున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్
భీంపూర్ మండలం అర్లి(టి) మందపల్లి గ్రామంలో దేశీదారు అమ్ముతున్నరన్న సమాచారం మేరకు సీఐ సాయినాథ్ దాడులు నిర్వహించారు. మహారాష్ట్ర నుండి అక్రమంగా దేశీదారు తీసుకు వస్తున్న ఆత్రం లక్ష్మణ్, ఆశిష్ జైస్వాల్, కుంబేకర్ ప్రభాకర్, ఆత్రం కృష్ణలను అదుపులో తీసుకున్నారు. ఈ మేరకు 196 దేశీదారు బాటిల్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ సిరాజ్, ముంతాజ్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్