తాంసి: రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

65చూసినవారు
తాంసి: రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
తాంసి మండలం గోట్కూరి గ్రామంలో ఆదివారం భీం ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి పార్టీ చేస్తుందన్నారు. నేటి ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. పార్టీ నాయకులు ప్రకాష్, షారుక్, పటాన్, అశ్వక్, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్