సిరికొండ మండల కేంద్రంలోని శివాలయ రెండవ వార్షికోత్సవం సందర్భంగా సనాతన ధర్మ సమితి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సంత్ నారాయణ మహారాజ్ మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, సనాతన హిందూ ధర్మం విశ్వంలోనే అత్యంత గొప్పదని పేర్కొన్నారు. వందలాది మంది భక్తులు జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణతో శివాలయం ప్రాంతం మారుమోగింది. అంతకుముందు మండల కేంద్రంలో ర్యాలీ కూడా నిర్వహించారు.