ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామంలో
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులకు ఉరే దిక్కని గ్రామస్థులు మాజీ ఎంపీటీసీ సుభాష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ ముందు తాడులు పట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించారని, కానీ ప్రస్తుత
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు.