బోథ్ అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తోందని అటవీ అధికారి FRO ప్రణయ్ హెచ్చరించారు. గురువారం చింతలబోరి అటవీ ప్రాంతంలో అధికారులు పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. రైతులు, గొర్రెలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదని, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పులి కదలికలు గమనిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది.