మేక అడ్డురావడంతో బైక్ పై నుంచి కిందపడిన వ్యక్తి: గాయాలతో రిమ్స్ కు తరలింపు

3354చూసినవారు
మేక అడ్డురావడంతో బైక్ పై నుంచి కిందపడిన వ్యక్తి: గాయాలతో రిమ్స్ కు తరలింపు
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో, నిర్మల్ నుంచి గుడియాత్నూరుకు వెళ్లే మార్గంలో హెచ్.పీ గ్యాస్ సమీపంలో 53 ఏళ్ల సంగారం అనే వ్యక్తి మేక అడ్డురావడంతో బైక్ పై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో వ్యక్తికి ముఖం, కుడి కాలుకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం అతన్ని అదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్