ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలలో భాగంగా నెరడిగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. తెలంగాణ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, గ్రామంలో ఉన్న ప్రతీ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్ పాల్గొన్నారు.