బోథ్: రూ. 225 కోట్లతో ట్రస్ట్ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

62చూసినవారు
బోథ్: రూ. 225 కోట్లతో ట్రస్ట్ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
సోనాల్ మండలం గుర్రాల తాండ శివారులో రూ. 225 కోట్లతో నిర్మిస్తున్న బ్రహ్మ యోగ ఆశ్రమం ట్రస్ట్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ట్రస్ట్ నిర్మాణానికి 10 ఎకరాల భూమిని విరాళంగా అందించిన చౌహన్ కర్తార్ సింగ్, చౌహన్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అభినందించారు. గ్రామంలో రూ. 225 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు.

సంబంధిత పోస్ట్