గుడిహత్నూర్ మండల కేంద్రంలోనీ ఆర్టీసీ బస్టాండ్ పక్కన గురువారం టీజీఆర్టీసీ కార్గో సర్వీసు సేవలను అదిలాబాద్, నిజామాబాద్ కార్గో మేనేజర్ బి. పాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులకు మరింత వేగంగా భద్రంగా సరుకులు రవాణా చేయడానికి కార్గో విభాగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గృహ అవసరాలు, వ్యాపార అభివృద్ధికి ప్రజలు కార్గో సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.