తాంసి మండల కేంద్రంలోని 108 కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో పాము కలకలం రేపింది. వాహన పైలెట్ పొచ్చన్న కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లి తిరిగి గదిలోకి రావడంతో ఈఎంటి గజనన్ పైన పామును గమనించాడు. పాము కాటు వేసిందని అనుమానంతో గజనన్ను రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, రక్త పరీక్షల్లో రిపోర్టులు నార్మల్ వచ్చాయి. ప్రస్తుతం ఉంటున్న కార్యాలయం వాష్ రూమ్ శిథిలావస్థలో ఉందని, ఇలా మూడుసార్లు జరిగిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.