తలమడుగు: కల్తీ కల్లు నుంచి గ్రామాన్ని కాపాడండి

65చూసినవారు
తలమడుగు: కల్తీ కల్లు నుంచి గ్రామాన్ని కాపాడండి
కల్తీ కల్లు వల్ల ప్రాణాలు పోతున్నా అధికారులు స్పందించడం లేదని తలమడుగు మండలం ఖోడద్ గ్రామస్తులు అన్నారు. ఈ విషయమై కలెక్టర్ రాజర్షిషాకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో తాటి, ఈత చెట్లు లేవని. నిషేధిత మత్తుపదార్థాలతో కల్తీ కల్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ కల్లు తాగి ఎంతోమంది అనారోగ్య బారినపడటమే కాక. రహదారి ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయన్నారు. కల్తీ కల్లు నుంచి గ్రామాన్ని కాపాడాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్