ప్రభుత్వ వసతి గృహాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ కార్యక్రమం పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆర్గనైజేషన్ సెక్రటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం బోథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నూతన మెనూ అమలు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.