
సాయం చేసేందుకు వెళ్లి వాగులో కూతురు గల్లంతు
AP: విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులకు బట్టలు ఉత్తికేందుకు సాయం చేయడానికి వెళ్లిన 13 ఏళ్ల బాలిక ధనుశ్రీ కాలుజారి గెడ్డలో కొట్టుకుపోయింది. పోలీసులు, రెవిన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.




