బోథ్, నార్నూర్ సీహెచ్సీలకు ట్రూనాట్ యంత్రాలు

50చూసినవారు
బోథ్, నార్నూర్ సీహెచ్సీలకు ట్రూనాట్ యంత్రాలు
బోథ్, నార్నూర్ సీహెచ్సీల పరిధిలోని అనుమానితులకు క్షయ నిర్ధారణ పరీక్షలు మరింత సులభతరం కానున్న ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారిణి సుమలత పేర్కొన్నారు. బోథ్, నార్నూర్ సీహెచ్సీలకు ట్రూనాట్ యంత్రాలను ప్రభుత్వం సరఫరా చేసిందని తెలిపారు. ఆ ప్రాంతాల వాసులు నేరుగా సీహెచ్సీలకు వెళ్లి నమూనాలను అందజేసి నివేదికలు పొందవచ్చన్నారు. అనుమానితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్